ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన సలహా మేరకు వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట నియోజకవర్గ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు లకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందించాలని లక్ష్యంతో ఈనెల 5, 6 తేదీలలో మొదలుపెట్టిన సర్జికల్ మెగా క్యాంప్ లో భాగంగా ఇప్పటివరకు రెండు వందల అరవై ఐదు మేజర్ మైనర్ ఆపరేషన్లు చేయడం జరిగింది అన్నారు. సర్జికల్ క్యాంప్ లో భాగంగా ఉప్పునూoతల మండల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వంగూరు చారకొండ ఉప్పునుంతల మండలాలకు చెందిన 42 కేసులు శనివారం ఆపరేషన్లు చేయడం జరిగింది. సర్జరీ చేపించుకున్న వారందరూ కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. నల్లమల అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకుండా అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ యొక్క ఆపరేషన్లకు సంబంధించినవి చేయడం జరుగుతుంది. అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో సర్జికల్ క్యాంపులో నమోదు చేసుకున్న వారందరి కూడా విడుదలవారీగా ఆపరేషన్లు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా విషయాన్ని గమనించగలరు అని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డాక్టర్ తారా సింగ్, డాక్టర్లు రమేష్ చంద్ర, డాక్టర్ ప్రభు, బిక్కు, మహేష్, నందిని, ఇతర పారామెడికల్ సిబ్బంది వైద్యులు, మండల అధ్యక్షుడు కట్ట అనంత రెడ్డి,ఎంపీపీ అరుణ నరసింహా రెడ్డి, జడ్పిటిసి అనంత ప్రతాప్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.