– ఝాన్సీ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
– కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి
నవతెలంగాణ-పెద్దవంగర: కాంగ్రెస్ అగ్ర నాయకులు ఇటీవల ప్రకటించిన గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సతీష్, యూత్ నాయకులు పన్నీర్ వేణు అన్నారు. మంగళవారం వడ్డెకొత్తపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నికకు వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అనంతరం గ్రామ నూతన కమిటీ వివరాలను ప్రకటించారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దంతాలపల్లి ఉపేందర్, ఉపాధ్యక్షుడిగా బొల్లు వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన యాకయ్య, కోశాధికారిగా జాటోత్ చందర్, తుర్క భాస్కర్, సభ్యులుగా దంతాలపల్లి సోమనర్సయ్య, ఓర్సు ఎల్లయ్య, మద్దెల వెంకటసోములు, ఆంగోత్ లచ్చిరాం, మేకల రమేష్, బీసీ సెల్ గ్రామ అధ్యక్షుడిగా ముత్తినేని సోమేశ్వర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా చందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా రంజాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఉపేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారి వెంకన్న, దంతాలపల్లి రవి, జాటోత్ వెంకన్న, దండుగల ఎల్లయ్య, ఎస్కే సైదులు, దంతాలపల్లి ఎల్లయ్య, సోమ్ల నాయక్, యాకన్న, దండుగల మైసయ్య, దంతాలపల్లి లక్ష్మయ్య, బాలాజీ, మద్దెల సోమయ్య, దంతాలపల్లి ప్రశాంత్, గద్దల సతీష్, కొమ్ము శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.