– జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ-రామారెడ్డి : కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలతో పాటు, గతంలో ప్రకటించిన పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని ప్రతి ఇంటింటికి తీసుకెళ్లాలని మంగళవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి అన్నారు. మండల కేంద్రంలో గ్యారంటీ కార్డు పథకాల పోస్టర్ను ఆవిష్కరించి, గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అంతకుముందు బస్టాండ్ ఆవరణలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెండ్యాల నర్సారెడ్డి, గంగారెడ్డి, చింతకుంట కిషన్, బండి ప్రవీణ్, బి పేట నరసింహులు, పరశురాం, జగన్, నామాల రవి తదితరులు పాల్గొన్నారు.