ఇచ్చిన ప్రతి హామీని తక్కువ సమయంలోనే అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ దే

– పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
– 35 వ వార్డ్ చర్చి కాంపౌండ్ ప్రాంతాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాం
– తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
నవతెలంగాణ – సూర్యాపేట
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తక్కువ సమయంలోనే అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే నని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. 35వ వార్డ్ కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్ ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్, బిజెపి పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా శనివారం స్థానిక తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అతి తక్కువ సమయంలోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంతమని అన్నారు.ఇందిరమ్మ ఇల్లు లు ప్రతి నియోజకవర్గానికి 3500  కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. 35 వ వార్డ్ చర్చి కాంపౌండ్ లో 50 నుంచి 100 వరకు ఇల్లులు వచ్చే అవకాశం ఉందన్నారు. చర్చి కాంపౌండ్ ను దత్తత తీసుకోని అవసరమైతే సొంత నిధులతో అయినా చర్చి కాంపౌండ్ ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. అదేవిధంగా  చర్చి కాంపౌండ్ లో ఉన్న చర్చి తో పాటు మజీద్, దేవాలయాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని కాంగ్రెస్ వైపే ప్రజలంతా ఉన్నారని కాంగ్రెస్ గెలుపు ఖాయం అన్నారు.బావి ప్రధాని రాహుల్ గాంధీ నేతృత్వంలో తుక్కు గూడ  బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పేదవారి కలలను అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ పూర్తి  చేస్తుందన్నారు. గడిచిన మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని ఇంకా ముందు ముందు దేశ భవిష్యత్తును మార్చేలా కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుందన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కష్టాలు కన్నీళ్లు చూసినవాడని ఏ ఒక్కరికి ఏ చిన్న కష్టం రాకుండా చూసుకుంటాడాని పేర్కొన్నారు.
Spread the love