కార్యకర్తలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ అండ

నవతెలంగాణ-భిక్కనూర్
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటుందని, మాజీమంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. గురువారం మండల కేంద్రానికి చెందిన పార్టీ కార్యకర్త బసగళ్ల సిద్ధిరాములుకు రెండు లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు జరిగిందని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love