కాంగ్రెస్‌ జూటాపార్టీ

– దగాకోరు నాయకుల మాటలు నమ్మొద్దు
– రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ కంగ్టి
కాంగ్రెస్‌ జూటాపార్టీ అని, ఆ పార్టీ దగాకోరు నాయకుల మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేకూరే సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతామంటూ అబద్దపు మాటలు చెపుతూ మీముందుకు వస్తున్న జూటా కాంగ్రెస్‌ నాయకులను నమ్మ వద్దని అన్నారు. కంగ్టి నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన తడ్కల్‌ మండల ప్రజలు మం గళవారం నిర్వహించిన కతజ్ఞత సభకు మంత్రి హరీ శ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తడ్కల్‌ ప్రజల ముప్పై ఏండ్ల కల ఎమ్మెల్యే భూపాలరెడ్డి సహకారంతో నిజమైంద్నారు. ప్రజలవద్దకు పాలన అందించాలనే ఉద్దేశంతో కెసిఆర్‌ ప్రభుత్వం ఖేడ్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చి మొదటి విడతలో షిర్గాపూర్‌, నాగల్గిద్దా మండలాలను ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. డెబ్భై ఏండ్ల పాలనలో ఎందుకు మండలాలు ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు గా మార్చి.. ఇప్పుడు ఉచిత కరెంటు ఇస్తామనడం ఎంత వరకు కరక్ట్‌ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కన కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా? తెలంగాణలో హామీ ఇచ్చిన వాటిని అక్కడ అమలు చేసి ఇక్కడ మాట్లాడాలన్నారు. నాగ నపల్లి, గాజులపాడు, సుక్కల్తీర్త్‌ గ్రామాల మధ్యలో బ్రిడ్జి నిర్మాణానికి కోటి అరవై లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. కంగ్టి అంబేద్కర్‌ చౌరస్తా నుంచి బీమ్రా, నాగూర్‌ మీదుగా బీదర్‌ బార్డర్‌ వరకు పద్దెంది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలతో రెండు లైన్ల రోడ్డు నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. ఇంత అభివధికి పాల్పడుతున్న భూపాలరెడ్డిని మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిసద్‌ ఛైర్మెన్‌ మంజూసిరిజైపాలిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, స్థానిక జడ్పిటిషి, లలిత ఆంజనేయులు, యంపిపి సంగీత వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎస్గి గంగారాం, కష్ణ ముదిరాజ్‌, మాజీ అధ్యక్షులు విశ్వనాథ్‌ పాల్గొన్నారు.
నవతెలంగాణ-నారాయణఖేడ్‌రూరల్‌
కాంగ్రెస్‌ పార్టీ మాయ మాటలను నమ్మొద్దని.. 60 ఏండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారని మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ పార్టీని విమ ర్శించారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో మంగ ళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభో త్సవం, శంకుస్థాపనల్లో మంత్రి పాల్గొన్నారు. ముం దుగా ఖేడ్‌ గ్రంథాలయం ప్రారంభించారు. అనంత రం కళ్యాణ లక్ష్మిచ షాది ముబారక్‌కు సంబంధించిన 500 చెక్కులు పంపిణీ చేశారు. పలువురి లబ్దిదా రులకు భూ పట్టాలు, వికలాంగులకు పెరిగిన పిం ఛన్‌ చెక్కులు అందజేశారు. అనంతరం నారాయ ణఖేడ్‌ హెచ్‌ఆర్‌ ప్యాలెస్‌లో ఎమ్మెల్యే మహారెడ్డి భూ పాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 60 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ఒక్క అభివృద్ధి కార్యాక్రమం జరగలేదన్నారు. గ్రామపంచా యతీగా ఉన్న ఖేడ్‌ మున్సిపాల్టీగా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. అలాగే నియోజవకర్గంలోని ప్రజల కోరిక మేరకు కొత్తగా నిజాంపేట, ప్రస్తుతం తడ్కల్‌ మండలాలను ఏర్పాటు చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి నిత్యం కృషి చేస్తున్నదన్నారు. రైతుబం ధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తూ.. రైతులకు సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారన్నారు. కానీ నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కాలిపోయే మోట్లార్లు.. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఉండేవన్నారు. అలాంటి వారు నేడు అభివృద్ధి గురించి మాట్లాడడం విచిత్రంగా ఉన్నదన్నారు. నారాయణఖేడ్లో 30 పడకల ఆసుపత్రి ఉంటే దానిని 150 పడకల ఆసుపత్రిగా చేశామన్నారు. 30 మంది డాక్టర్లను నియమించామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా నిత్యం ప్రజా సేవలో ఉంటూ.. ఈ ప్రాంత అభివృద్ధికి తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. కాబట్టి సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచి మరోమారు భారీ మెజార్టీతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Spread the love