గిరిజనుల హక్కులను కాపాడడంలో మోడీ ఫెయిల్: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

నవతెలంగాణ – ఢిల్లీ: మోడీ ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్బంగా కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని గిరిజనుల హక్కులను కాపాడటంలో మోడీ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి ప్రధాన ఆధారంగా పరిగణించబడే దట్టమైన, జీవవైవిధ్యం అధికంగా ఉండే హస్డియో అటవీ ప్రాంతానికి బీజేపీ, వారికి అత్యంత మిత్రుడైన అదానీ నుంచి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అడవిని రక్షించడానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ అడవిలో 40 బొగ్గు బ్లాకులను రద్దు చేసినట్టు గుర్తు చేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక అదానీకి చెందిన కంపెనీతో మైనింగ్‌ను పున:ప్రారంభించిందని ఆరోపించారు. ఆదివాసీ సంఘాల నుంచి తీవ్రమైన నిరసనలు ఎదురైనప్పటికీ వాటిని కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు.

 

Spread the love