నవతెలంగాణ – నసురుల్లాబాద్
అభయ హస్తం 6 గ్యారెంటీల పథకంలో భాగంగా 2 గ్యారెంటీలను అమలు చేసినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి బుధవారం , నసురుల్లాబాద్ బీర్కూర్ మండల కేంద్రంల్లో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీర్కూరు మండల అధ్యక్షులు బోయిని శంకర్, టౌన్ అధ్యక్షుడు రామ రాములు, జిల్లా కార్యదర్శి కొత్తకాపు కాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు బసవరాజ్ పటేల్, దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.