ఓటమి భయంతో పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు

నవ తెలంగాణ మల్హర్ రావు.
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని మండల బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.మండల కేంద్రములో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు  దుబ్బాక అభ్యర్థిని కత్తితో దాడి విషయాన్ని తీవ్రంగా  ఖండిస్తున్నట్లుగా బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కుంభం రాఘవరెడ్డి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దిగ్విజయంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న  దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్త రాజు చేతిలో కత్తిపోటు గురైన విషయం తెలిసిందేన్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే మా తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హత్య రాజకీయాలకు పునాది వేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి దీనికి ప్రోత్సహిస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంబడే రాజీనామా చేసి తన నిజాయితీని చాటలన్నారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు,యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్,నాయకులు తాజాద్దీన్,యదగిరిరావు, కోట రవి పాల్గొన్నారు.
Spread the love