బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు సాయిలు

నవతెలంగాణ – మద్నూర్

త్యాగానికి సత్యానికి ప్రతీక బక్రీద్ పర్వదినమని మొహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ వార్ సాయిలు పేర్కొన్నారు. సోమవారం నాడు బక్రీద్ పండుగ సందర్భంగా మండల మైనార్టీ నాయకులు జావిద్ పటేల్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయన ఇంటికి వెళ్లి అతనికి అతని కుటుంబ సభ్యులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా జావిద్ పటేల్ అందరికీ సురుకుంభ స్వీట్ లను తినిపించారు. జావిద్ పటేల్ ఇంటికి వెళ్లిన వారిలో మద్నూర్ మండల కేంద్ర మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు కర్ల సాయిలు ప్రధాన కార్యదర్శి సందూరు వార్ హనుమాన్లు మాజీ ఉపసర్పంచ్ అవర్ వార్ హనుమాన్లు మాజీ వార్డు సభ్యులు జ్ఞానేశ్వర్ ఇతరులు సాయిని భారత్ గంగాధర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love