నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజా శ్రీనివాస్ కు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాజా శ్రీనివాస్ ను కలిసి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, నాయకులు పాలెపు నరసయ్య, బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.