కాంగ్రెస్ నేతలు భారీగా బైక్ ర్యాలీ

– జిల్లా నాయకుడు కాసం రంజిత్ రెడ్డి 

నవతెలంగాణ- నెల్లికుదురు: మండలంలోని రామన్నగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించినట్లు ఆ పార్టీ జిల్లా నాయకుడు కాసం రంజిత్ రెడ్డి తెలిపాడు. మంగళవారం మండలంలోని నెల్లికుదురు బ్రాహ్మణ కొత్తపల్లి రామన్నగూడెం కాచికల్ రతిరాం తండా రాజుల కొత్తపల్లి నైనాల గ్రామం తోపటు మండలంలోని వివిధ గ్రామాలలో నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ఆ గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మురళి నాయక్ గెలుపు కోసం మండలంలోని వివిధ గ్రామాలలో ఆ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఉచిన్టి గడప ప్రచారంలో సోనియాగాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ ల గురించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఓటర్లను కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్  గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు కాంగ్రెస్  అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. ఈ ఎన్నికల్లో మురళి నాయక్ ను గెలిపించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నాయక్ లక్ష్మారెడ్డి ఎదెళ్ల యాదవ రెడ్డి హెచ్ వెంకటేశ్వర్లు మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ మాజీ మండల అధ్యక్షుడు అశోక్   భాస్కర్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ సురేష్ రాజేందర్ మద్ది రాజేష్ మల్లేశం శ్రీనివాస్ గోవర్ధన్ గుట్టయ్య యాక సాయిలు శ్రీపాల్ రెడ్డి పిట్టల మురళి తో పటు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నారు.
Spread the love