ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడి విస్మరించిన కాంగ్రెస్ నాయకులు..!

– చర్చనీయాంశంగా మారిన ఖర్గే ఫోటో విస్మరణ
– ఫోటో లేకుండా కార్యాలయం ప్రారంభించడంపై కాంగ్రెస్ శ్రేణుల అసహనం
నవతెలంగాణ-బెజ్జంకి
ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఫోటోను విస్మరించి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నాయకులు ప్రారంభించడమేంటని పలువురు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాశంగా మారింది.శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన నూతన కాంగ్రెస్ పార్టీ కార్యలయాన్ని కరీంనగర్ జిల్లాధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు.కార్యాలయ గోడపై ఏర్పాటుచేసిన జాతీయ కాంగ్రెస్ నేతల ప్రోటోకాల్ యందు జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఫోటోను విస్మరించి ప్రారంభం చేయడం సరైందికాదని కార్యాలయ ప్రారంభానికి హజరైన మండలంలోని పలువురు కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నారు. నియోజవర్గ, మండల నాయకులు పార్టీ బలోపేతానికి పని చేస్తున్నారో లేక?వ్యక్తిగత స్వార్థం కోసం పని చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి మండల కాంగ్రెస్ పార్టీలో నెలకొందని..ఇప్పటికైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మానకొండూర్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవశ్యకత ఉందని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.

Spread the love