అంబరాన్నంటిన..కాంగ్రెస్‌ నాయకుల సంబురాలు

నవతెలంగాణ – వనపర్తి రూరల్‌
నవంబర్‌ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక లలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీదే హవా కొనసాగింది అదే గ్రామంలో వనపర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తుడిమేగా రెడ్డి గెలవడంతో ఎన్నో సంవత్సరాల త ర్వాత కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గంలో రాష్ట్రస్థాయిలో అధి కారం దక్కడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులలో ఆనందో త్సవాలు వెళ్లీవిరిచాయి నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో ఉందని తెలుసుకున్న సమాచారం తో ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చుతూ డాన్సులు బొడ్డెమ్మలతో అందరిని అలరించ డానికి డీజే సిస్టంలతో నియోజకవర్గాంలో ఆనందోత్సవాలు వెళ్లీవేరి చాయి గ్రామాలలో ఆడవాళ్లు చిన్నపిల్లలు డ్యాన్సు లతో ఆనందోత్సవాలతో నిండిపోయారు
ఆత్మకురు: ఆత్మకూరు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భక్త నియోజకవర్గం గెలుపు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు నిరంతరం కషి చేసి గెలుపునకు కషి చేసిన ప్రతి ఒక్కరికి కతజ్ఞతలు తెలిపారు. అనంతరం పట్టణంలోని ఇందిరా గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాల వేశారు. వివిధ గ్రామాలలో ప్రధాన కోడలు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జబ్బార్‌,రఫిక్‌, గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌ ,గాలి పంపు శ్రీనివాసులు , రామ లక్ష్మారెడ్డి, వెంకట నరసిం హారావు, గాండ్లరఘు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెబ్బేరు: అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మెగా రెడ్డి గెలుపొందడంతో పెబ్బేరు పురపాలక కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా కాలుస్తూ జై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. మెగా రెడ్డి 25వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. పెబ్బేరు, శ్రీరంగాపూర్‌ మండలాల నుండి కాంగ్రెస్‌ అభ్యర్థి మేఘారెడ్డికి ప్రజలు స్పష్టమైన మెజార్టీని అందించారు. రెండు మండలాల నుంచి దాదాపు పదివేల పైగా మెజార్టీ వచ్చింది. పెబ్బేరు పురపాలక కేంద్రంతోపాటు మండ లంలోని ఒకటి రెండు గ్రామాలు మినహాయిస్తే అన్ని గ్రామాలలో కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ లభించింది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
వీపనగండ్ల: మండల కేంద్రంతో పాటు, గోవర్ధనగిరి, గోపాల్‌ దీన్నే కల్వరాల పుల్గర్‌ చర్ల, బొల్లారం తుంకుంట సంపత్‌ రావు పల్లి పలు గ్రామాల్లో కొల్లాపూర్‌ అభ్యర్థి ఎమ్మెల్యే మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు గెలుపు పై కార్యకర్తలు , నాయకులు, ప్రజలు బాణ సంచాలు కాలుస్తూ, డప్పులు వాయిస్తు నత్యాలు చేస్తూ ఆయా గ్రామాలలో ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల రైతు బంధు అధ్యక్షులు వల్లభాపురం నారాయణరెడ్డి, ఎత్తం కష్ణయ్య యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల మండల అధ్యక్షులు డాక్టర్‌ గోదల బీరయ్య మండల ఎంపిటిసిలపురం సంఘం ఎంపిటి ఫోరం సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఇంద్రకంటి వెంకటేష్‌ మండల నాయకులు సుదర్శన్‌ రెడ్డి, రఘునాథ్‌ రెడ్డి, వెంకట రాజయ్య, చక్ర వెంకటేష్‌, ఎస్‌ రవీందర్‌ రెడ్డి, చిన్నారెడ్డి, ధనుంజయుడు, కావలి మహేష్‌, వెంకట్‌ రెడ్డి, వైయస్‌ వెంకటయ్య, తిరుపతయ్య, నాగన్న, చిన్నపాగ మౌలాలి, కష్ణయ్య, మాజీ ఎంపీటీసీ పెంటయ్య, బి , వెంకటస్వామి సుధాకర్‌ రెడ్డి, కుమ్మరి వెంకటస్వామి, చుక్క కర్ణాకర్‌, కమ్మరి స్వామి, కష్ణయ్య గట్టు రాజయ్య, గట్టు సురేష్‌, గట్టు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love