గొల్లపల్లిలో కాంగ్రెస్‌ నాయకుల సంబురాలు

నవతెలంగాణ- శంషాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో మండలంలో ఆదివారం కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు చేసు కున్నారు. మండలంలోని చిన్న గొల్లపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు స్వీట్లు పంచి బాణసంచా కాల్చారు. 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో వారి అవధులు లేకుండా పోయాయి. ప్రజాస్వామ్యంలో ప్రజ లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని గొల్లపల్లి కాంగ్రెస్‌ సీనియర్‌ మున్సిపల్‌ ఉపాధ్యక్షులు గణేష్‌ అన్నారు. కాంగ్రెస్‌ తీసుకువచ్చిన 6 గ్యారంటీలు రాష్ట్రంలో తక్షణమే అమలు అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జనరల్‌ సెక్రెటరీ వెంకటేష్‌ గౌడ్‌, సుధాకర్‌ రెడ్డి, రాజు, చారి, కుమార్‌, సుధాకర్‌, నాగరాజు, అంజన్‌, చారి, మహేష్‌, వాసు, ప్రసాద్‌, కరుణాకర్‌, ప్రదీప్‌, భాను తదితరులు పాల్గొన్నారు.

Spread the love