కాంగ్రెస్‌ నాయకుల సంబురాలు

– కొడంగల్‌ గడ్డపై కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి,
– పేటలో కాంగ్రెస్‌ అభ్యరి పర్ణికారెడ్డి విజయం
కోస్గి: బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి పై టీపీసీసీ సభ్యులు రేవంత్‌ రెడ్డి గెలుపొంది కొడంగల్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండాను ఎగరవేశారు. ఆదివారం తెలంగాణ ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఎన్నికల ఫలితాలలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్‌ రెడ్డి పై 32,532 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత నెల 30న జరిగిన ఎన్నికల్లో 1,95,187 మంది (పోస్టల్‌ బ్యాలెట్‌ తో సహా) ఓటు హక్కును వినియో గించుకున్నారు. ఇందులో రేవంత్‌రెడ్డికి 1,07429 ఓట్లు రాగా, ప్రత్యర్థి నరేందర్‌రెడ్డికి 74,897 కోట్లు వచ్చాయి. మున్సిపాలిటీ కేంద్రంలోని పలు వార్డులలో కాంగ్రెస్‌ నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచాలు కాల్చి సంబురాలు జరుపు కున్నారు. కొడంగల్‌ బిడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించ నున్నారని నియోజకవర్గ అభివద్ధి వేగంగా జరగ నుందని పలువురు ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు.
పేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి
డాక్టర్‌ చిట్టెం పర్ణిక రెడ్డి విజయం
మరికల్‌: నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వర్ణికా రెడ్డి 7950 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో మరికల్‌లో విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. మరికల్లో వెంకటాపూర్‌ గ్రామస్తుల మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. పేట జిల్లా లోని నారాయణపేట నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి 7950 ఓట్లతో మెజార్టీ సాధించారు. దీంతో మరికల్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సూర్య మోహన్‌ రెడ్డి , సూర్య ప్రకాష్‌ ,హరీష్‌ కుమార్‌ వెంకటరామరెడ్డి నారాయణరెడ్డిల, 449 భూ బాధితుల ఆధ్వర్యంలో మరికల్‌ మండల కేంద్రంలోని పలు వార్డులలో భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మరికల్‌ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో భారీ ఎత్తున బాణా సంచా కాల్చారు. మరికల్‌ మండ లంలోని వెంకటాపూర్‌, ఇబ్రహీంపట్నం, గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విజరు కుమార్‌ రెడ్డి, వర్ధన్‌ రెడ్డి, కర్ణాకర్‌, బాబు , పాండు రెడ్డి , శ్రీని వాస్‌రెడ్డి ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్ద చింతకుంట గ్రామా నికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు అంజలి రెడ్డి ఆధ్వర్యంలో మరికల్‌ మండల కేంద్రంలోని ఇంద్ర గాంధీ చివరస్తలో భారీగా బాణసంచాలు కాల్చారు. ధన్వాడ మండల కేం ద్రంలో మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. అనంతరం స్వీట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్‌ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ శ్రేణుల సంబురాలు
నర్వ: ఆదివారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా తో పాటు నారాయణపేట జిల్లాలో రెండు నియోకవర్గాలు కూడా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడంతో నర్వ మండల కేంద్రంతో పాటు మండలంలోని రాయికొడ్‌ ,రాజుపల్లి తదితర గ్రామాల్లో కాంగ్రెస్‌ కార్య కర్తలు బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. నియోజకవర్గంలో గెలుపొందిన వాకిటి శ్రీహరి మొదటిసారిగా గెలుపొ ందారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్పంచి నుంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెట్టి ఫ్లోర్‌ లీడర్‌ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి గెలుపొందడం పట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. శ్రీహరి గెలుపుతో నియోజకవర్గం అన్ని రకాలుగా అభివద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కాంగ్రెస్‌ శ్రేణులు దీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టం కట్టడం హర్షనీ యమన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, డీ వెంకటేష్‌, ఆంజనేయులు గౌడ్‌, ఖాజా మైనుద్దీన్‌ ఆనంద్‌, గొల్ల మల్లేష్‌, మన్సూర్‌, డి రాములు, నర్సింలు, గోపాల్‌, పుల్లర్‌ రాజు, జి అంజి తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్‌ : మక్తల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేగా గెలుపొం దడంతో మండలకేంద్రంలో నాయ కులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా సంబురాలు జరుపు కున్నారు.ఒకరికీ ఒకరు మిఠాయి పంచుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజవర్గ కాంగ్రెస్‌ యువనాయకులు కార్తీక్‌ రెడ్డి, మండల నాయకులు లింగం జలాల్‌, శంకర్‌, రవికుమార్‌తో పాటు నాయకులు , కార్యకర్తలు అభిమా నులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love