అగ్నిప్రమాదం సంభవించిన బాధితులకు సహాయం అందించిన కాంగ్రేస్ నాయకులు

నవతెలంగాణ – మోపాల్

మంగళవారం రోజున లోలం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గుడిసెలు ఒక ఇల్లు దగ్ధమైన, సత్తెమ్మ ,భూమయ్య, ప్రశాంత్ కుటుంబాలను మోపాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బున్నే రవీందర్, కాంగ్రెస్ నాయకుడు రఘు పటేల్ తో కలిసి బాధితులకు బియ్యం, బట్టలు కొంతవరకు నగదు సాయాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా బున్నే రవీందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉంటారని, బాధిత కుటుంబాల అధైర్య పడద్దని స్థానిక  ఎమ్మెల్యే భూపతిరెడ్డి తో మాట్లాడి, మీకు పక్కా ఇల్లు వచ్చే విధంగా చూస్తామని, అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందే విధంగా చూస్తామని ఆయన తెలిపారు. ఎల్లప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్య పడవద్దు వారికి మనోధైర్యం నింపాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాయికుమార్ మరియు ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ రవి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love