జిల్లా నూతన జిల్లా వైద్యాశాఖధికారిగా బాధ్యతలు చేపట్టిన నరేందర్ రాథోడ్ ను మంగళవారం యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోనే అత్యంత ఆదివాసులు వెనుకబడిన ప్రజలు ఉన్నటువంటి బేల మండలంలో ఎప్పటి కప్పుడు హెల్త్ క్యాంపులు నిర్వహించి సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కలిసిన వారిలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల నాగరాజు, ఎండి అఖిల్, కిరణ్ ఉన్నారు.