నవతెలంగాణ- డిచ్ పల్లి: టి పిసిసి చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి కామారెడ్డి లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్, బిసి డిక్లరేషన్ కు ఇందల్ వాయి మండలం నుండి కాంగ్రెస్ నాయకులు శుక్రవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే గా బారి మెజార్టీ తో విజయం సాధించి, రాష్ట్రంలో అధికారంలోకి కైవసం చేసుకుంటుందని అశాభావం వ్యక్తం చేశారు. తరలివేళ్ళిన వారిలో జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు ముప్పా గంగారెడ్డి, ఎన్ డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, మోతిలాల్ నాయక్, రాజన్న నారాయణ, మనోహర్, శ్రీనివాస్, వసంతరావు, గంగాధర్, వెంగల్, చాంద్ పాషా, రతన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.