కాంగ్రెస్ విజయభేరి మహాసభకు తరలి వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు.

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలం కాంగ్రెస్ నాయకులు తుక్కుగూడలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ విజయభేరి మహాసభకు తరలి వెళ్లారు. రెంజల్ మండలం సాటాపూర్ చౌరస్తా నుంచి వందలాది మంది కాంగ్రెస్ నాయకులు వాహనాలపై తరలి వెళుతున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ స్పష్టం చేశారు. తరలి వెళ్లిన వారిలో జిల్లా నాయకులు శంకర్ గౌడ్, సురేందర్ గౌడ్, జావిద్ ఉద్దీన్, అంజయ్య, సాయిబాబా గౌడ్, గంగా కృష్ణ, రాకేష్, ఎమ్మెల్ రాజు, ఉబేద్, కంఠం గంగారం, యువజన నాయకులు సిద్ధ సాయిలు ,శంషుద్దీన్, ఎల్ కృష్ణ, సద్దాం, గైన కిరణ్, సుమారు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love