కాంగ్రెస్‌ అంటేనే ప్రజా సంక్షేమం : మంత్రి సీతక్క

నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్‌ అంటేనే ప్రజా సంక్షేమం అని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాబోయే బడ్జెట్‌లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ‘‘గత పదేళ్లలో ఎంత మందికి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు వచ్చాయో ప్రజలు ఆలోచించుకోవాలి. భారాస నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు లేని వాళ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.

Spread the love