కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని పిలుపు..

– మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు మండవ వెంకటేశ్వరరావు..
నవతెలంగాణ- డిచ్ పల్లి:  గురువారం జరకనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండవ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి లోని మండవ స్వగ్రామంలో అయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీ ఇచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందారని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు క్లారిటీ స్కీములను తప్పకుండా అమలు చేస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు. ఉన్న సమయంలోనే నిజామాబాద్ రూలర్ బాన్సువాడ బోధన్ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్  అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని ఎక్కడ చూసినా ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని మండవ వెంకటేశ్వరరావు అన్నారు. నియోజకవర్గం లో ఉన్న మహిళలు ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి నిర్వహించిన ప్రచార సభల్లో భారీ ఎత్తున పాల్గొనడం గెలుపునకు సంకేతం అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన ప్రతి హామీని అమలు చేస్తుందని విశ్వాసం ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలు సైనికుల పనిచేసే యంగా ప్రజలను పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. అంతకుముందు డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా మండవ వెంకటేశ్వరరావు ను కలిశారు.
Spread the love