కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చింది..

– దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక…
– సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి….
నవతెలంగాణ భువనగిరి రూరల్ 
కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిందని, దేశ అభివృద్ధిలో నాడు అంధకారంలో ఉన్న గ్రామాలకు కరెంటును తీసుకువచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కీలక పాత్ర పోషించిందని మాజీ సేల్ఫీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అనాజిపురం గ్రామంలో గల జి ఏన్ పి గార్డెన్లో భువనగిరి మండల కార్యకర్తల సమావేశం నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పదవులను, ప్రభుత్వాన్ని త్యాగం చేసి తెలంగాణను తీసుకువచ్చింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు, రైతులకు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఒక కిలో బియ్యం, తెలంగాణలో మూడు లక్షల ఇండ్లను కట్టించిందని, 2,40,000 భూములను పేదలకు పంచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ 1996 సంవత్సరంలోనే అన్ని గ్రామాలకు కరెంటు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలలో 75 వేల కోట్లు అప్పు చేస్తే, బిఆర్ఎస్ ప్రభుత్వం  9 పైగా సంవత్సరాలలో లక్ష కోట్లకు పైగా అప్పు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో మీ ముందుకు వచ్చిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక హామీని ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు మోసపూరిత మాటలతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నారని, తెలంగాణ ప్రజలు విజ్ఞానవంతులని ఈసారి కెసిఆర్ కు బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలకు పైగా నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో పేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ అసమర్థత వలన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సొంత వాహనంతో సిలిండర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేద ప్రజలకు కరోనా కష్ట కాలంలో అండగా ఉంటూ వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నట్లు తెలిపారు. నిరుపేదలకు వైద్య సహాయం కోసం, విద్యార్థులకు విద్య సహాయం కోసం ఆర్థిక సహకారం అందజేసినట్లు తెలిపారు. కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉంటూ, వారికి అండగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ నాయకులు తంగేళ్లపల్లి రవికుమార్, వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజు, నాయకులు ఎల్లంల జంగయ్య యాదవ్, చిక్కుల వెంకటేశం, వల్లందాస్ ఆదినారాయణ, మట్ట శంకర్ బాబు, గడ్డమీది వీరస్వామి గౌడ్, కోనూరు ఎంపిటిసి పాశం శివానంద్, రావి సురేందర్ రెడ్డి, ఏ శ్రీరాములు, కోట పెద్ద స్వామి, కోట మహేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీల నుంచి కాంగ్రెస్లో 400 మంది చేరిక…
భువనగిరి మండల వ్యాప్తంగా నందనం, పెంచికలపహాడ్, వీరవెల్లి, తాజ్పూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ బీజేపీతో పార్టీ ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో  కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు.
Spread the love