నీల గ్రామంలో జోరు అందుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం..

నవ తెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం నీల గ్రామంలో సీనియర్ నాయకులతో పాటు, యువత అత్యధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండలంలోని తాడి బిలోలి, బోర్గం గ్రామాలలో సైతం కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీ గెలుపుకు సహకరిస్తామని వారు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సాయి రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎల్ రాజు, గంగా కృష్ణ, బీసీ సెల్ మండల అధ్యక్షులు గోసుల గంగా కిషన్, తాడిపల్లి మాజీ సర్పంచ్ రాజేశ్వర్, గ్రామ అధ్యక్షులు చీరడి రవి, సోక్కుల సాయిలు, శ్రీనివాస్, యువజన నాయకులు కార్తిక యాదవ్, సద్దాం, అర్బాజ్, శంషాద్దీన్, సిద్ధ సాయిలు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love