– హాజరుకానున్న మంత్రులు వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో నల్గొండ నియోజకవర్గ బూతు స్థాయి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖామంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి హాజరుకానున్నారు.