మాట తప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు..

– ఇచ్చిన హామీలను అధికారం లోకి వచ్చిన 90 రోజులలో  అమలు చేస్తాం..
– వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్. 
నవతెలంగాణ – వేములవాడ
మాట తప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీ కి లేదు.. ఇచ్చిన హామీలను అధికారం లోకి వచ్చిన 90 రోజులలో  అమలు చేస్తాం.. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు.  బుధవారం వేములవాడ పట్టణంలోని గాంధీనగర్, శివానగర్ లో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ పథకాలు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెల 2500. 500 కి గ్యాస్ సిలిండర్ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15 వేల రూపాయలు పెట్టుబడి సహాయం వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు సంవత్సరానికి 500 రూపాయలు వరి పంట కు పంట  బోనస్ కింద వర్తింప చేస్తామని తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 2 యూనిట్ల విద్యుత్తు ఫ్రీ , ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.  యువ వికాసం పథకం కింద విద్యార్థులకు5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, చేయూత పథకం కింద 4వేల రూపాయలు వృద్ధులకు నెలవారి పింఛన్లు 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తుక్కుగూడ సభలో  సోనియా గాంధీ  ప్రకటించిన ప్రతి హామీలను గడపగడపకు   వివరించారు, తెలంగాణ రాష్ట్రన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరారు. ఈ  కార్యక్రమం లో కరీంనగర్ మహిళా జిల్లా అధ్యక్షురాలు కర్ణ సత్య ప్రసన్న, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు చిలుక రమేష్ కూరగాయల కొమరయ్య, పాత సత్యలక్ష్మి, సూగురి లక్ష్మి, కనికరపు రాకేష్, తోట లహరి, కోలకాని రాజు, లింగంపల్లి కిరణ్, వస్తాది కృష్ణ  చాంద్ పాషా, సాబీర్, నీలం గురవయ్య, మండల సందీప్, పోతారం నవీన్, చిలివేరి శ్రీనివాస్, ఎర్రం రాజు, తంగేళ్ల గణేష్, అక్కనపల్లి నరేష్, సాయిని అంజయ్య, కూర అంజయ్య,
తదితరులు పాల్గొన్నారు.
Spread the love