తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ పార్టే

– మహేశ్వరం గడ్డపైనా కూడా కాంగ్రెస్‌ జెండా ఎగరవేస్తాం
– జడ్పీ జిల్లా మాజీ ఫ్లోర్‌ ఏనుగు జంగారెడ్డి
– కాంగ్రెస్‌లో ఇతర పార్టీల నాయకులు చేరిక
నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ పార్టేనని, మహేశ్వరం గడ్డపై కూడా కాంగ్రెస్‌ జెండా ఎగరవేస్తామని జెడ్పీ జిల్లా మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఏనుగు జంగారెడ్డి, బడంగ్‌పేట మేయర్‌ చిగురింత పాజాత నరసింహ రెడ్డి అన్నారు. మంగళవారం కందుకూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా నాయకులు జాపాల కిష్టయ్యతో పాటు, గూడూరు గ్రామం నుంచి, ఇతర పార్టీల నాయకులు, రాచులూరు గ్రామానికి చెందిన వంద మంది నాయకులు, కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు సభావాత్‌ కృష్ణానాయక్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ విజయభేరి సభతో ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు తెలంగాణ ప్రజల్లో నమ్మకం కలుగుతుందన్నారు. ప్రజల దీవెనలు ఆశీర్వాదాలు కాంగ్రెస్‌కు దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రచార కో-ఆర్డినేటర్‌ సరకొండ మల్లేష్‌, వైస్‌ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌ రెడ్డి , జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి అఫ్జల్‌ బెగ్‌, సయ్యద్‌ అజీజ్‌ , శ్రీకాంత్‌రెడ్డి, ఫకీర్‌ కృష్ణ, వీరేష్‌, పాండు రంగారెడ్డి, సబావత్‌ గణేష్‌, వరికుప్పల బాబు, ప్రశాంత్‌, జగదీష్‌ కురుమ, శేఖర్‌, కుమార్‌, సురేందర్‌, ప్రవీణ్‌, సాయిలు, వి.యాదయ్య, జంగయ్య, దశరథ, నరసింహ, పాండు, జంగయ్య, అంజయ్య, శ్రీనివాస్‌, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love