5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం..

– కర్ణాటకలో ఐదు గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నాం
– అధికారం చేపట్టగానే తెలంగాణలో 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తాం
– కర్ణాటక రాష్ట్ర హెల్త్ మినిస్టర్ డాక్టర్ దీపక్ గుండురావు

నవతెలంగాణ-శాయంపేట : దేశంలోని తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్, మిజోరామ్ రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని కర్ణాటక రాష్ట్ర హెల్త్ మినిస్టర్ డాక్టర్ దీపక్ గుండురావు అన్నారు. మండలంలోని సూర్యనాయక్ తండ, కొప్పుల గ్రామాలలో బుధవారం రాత్రి భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు నిర్వహించిన ప్రచారంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని కార్నర్ సమావేశంలో మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గం లో జి ఎస్ ఆర్ గెలుపు ఖాయమని  దిమా వ్యక్తం చేశారు. గత ఆరు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అక్కడి ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని మట్టికరిపించారని  గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రకటించిన ఐదు గ్యారంటీ పథకాలను అధికారం చేపట్టగానే మంత్రివర్గ సమావేశంలో సీఎం సీతారామయ్య ఆమోదించి అమలు చేస్తున్నారని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ప్రతి కుటుంబానికి 2000 బ్యాంకు ఖాతాల్లో జమ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ, నిరుద్యోగ యువకులకు యువనిధి ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు. 25 వేల కోట్ల నిధులతో ఐదు గ్యారెంటీ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జి ఎస్ ఆర్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రచార కార్యదర్శి శోభారాణి, గాజర్ల అశోక్, వైయస్సార్ టిపి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, మండల నాయకులు దూదిపాల బుచ్చిరెడ్డి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, చల్లా చక్రపాణి, దుబాసి కృష్ణమూర్తి, డీటీ రెడ్డి, చిందం రవి, పోతు కృష్ణమూర్తి, మారపల్లి బుజ్జన్న, తదితరులు  పాల్గొన్నారు.

Spread the love