– మల్హర్ రావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బడితల రాజయ్య ఆధ్వర్యంలో స్టబు స్టేషన్ ముందు ధర్నా
– ముఖ్యఅతిథిగా వచ్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే ప్రకాష్ రెడ్డి గారు
నవతెలంగాణ;భూపాలపల్లి, మల్హర్ రావు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు దండు రమేష్ మాట్లాడుతూ కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే మాట వట్టి బూటకం అని,రైతులకు కేవలం 10 గంటలు లేదా 12 గంటలు కరెంటు ఇస్తూ ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి అత్యధిక ధరలకు కరెంటు కొనుగోలు చేస్తూ, రైతు పేరు చెప్పి ప్రైవేటు సంస్థల నుంచి కమీషన్లు కాజేస్తూ రైతుల్ని మోసం చేస్తున్నటువంటి కెసిఆర్ అని అమెరికాలో తాన సభలో కెసిఆర్ బండారాన్ని బయట పెట్టిన రేవంత్ రెడ్డి,వారి మతాలను జీర్ణించుకోలేకపోతున్న కెసిఆర్,రేవంత్ రెడ్డి గారి మాటలు వక్రీకరించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తును ఎత్తు వేస్తుందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
రైతులకు 9 గంటల ఉచిత కరెంటు పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ నేనని, దేశవ్యాప్తంగా రైతులకు 70 వేల కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు 12 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని మండల పార్టీ నాయకులు గుర్తు చేశారు.
రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా, దళిత బంధు అందరికీ ఇవ్వకుండా, ఇళ్ల నిర్మాణానికి మూడు లక్షల ఆర్థిక సాయం చేయకుండా, బీసీలకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఆశపెట్టి ఇంతవరకు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి 3,016 పంచకుండా, ఒకటో తారీకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా, విశ్రాంత ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు ఇవ్వకుండా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా,ప్రజలందరినీ మోసం చేస్తూ,పాలించటం చేతగాక కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించే టిఆర్ఎస్ నాయకులు నాటకాలు ఆడుతున్నారు రాబోయే అటు బిజెపికి ఇటు బిఆర్ఎస్ ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. దిష్టిబొమ్మ దహనం అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలోఎంపీపీ చింతలపల్లి మలహలరావు అయిత కోమల రాజిరెడ్డి ఎంపిటిసి నాగరాణి లక్ష్మీనారాయణ మల్హర్ మండల్ ఎస్సీ అధ్యక్షురాలు కొండ రాజమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు గడ్డం క్రాంతి మరియు ఎస్టి మండల అధ్యక్షులు బిక్షపతి మరియు గ్రామ శాఖ అధ్యక్షులు కేసరపు చంద్రయ్య మండల్ నాయకులు తిరుపతిరావు ఇప్ప మొండి సంగం రమేష్ మాజీ ఎంపిటిసిలు మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది