కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేరాలి..

– రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్
నవతెలంగాణ – ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కో ఆర్డినెటర్ లతో రాష్ట్ర కో ఆర్డినెటర్ నవీన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని సూచించారు. బి ఆర్ ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి ప్రతి ఒక్కరికి చేరేలా చేయాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైనా సోషల్ మీడియా కో ఆర్డినెటర్ లకు నియామక పాత్రలను అందాచేశారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా కొ ఆర్డినేటర్ గా- గైనీ సురేష్ ,ఎల్లారెడ్డి మండలం కొ ఆర్డినేటర్ గా- జహంగీర్,నాగిరెడ్డి పెట్ మండల కొ ఆర్డినేటర్ గా – సతీష్,లింగం పెట్ మండల కొ ఆర్డినేటర్ గా -కిరణ్ నాయక్ గాంధారి మండల కొ ఆర్డినేటర్ గా- దేవి సింగ్ రాథోడ్ సదాశివ నగర్ మండల కొ ఆర్డినేటర్ గా – రజినీ కాంత్ రెడ్డి తాడ్వాయి మండల కొ ఆర్డినేటర్ గా – అశ్వక్ లకు మండల కోఆర్డినేటర్లగా నియామక పత్రలను అందజేయడం జరిగింది..

Spread the love