అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి

ఇంటింటా ఆరు గ్యారంటీలపై విస్తృతంగా  ప్రచారం
నవ తెలంగాణ -మల్హర్ రావు.
అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు.జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి,మాజీ మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శనివారం మండలంలోని మల్లారం,రుద్రారం,తాడిచెర్ల,ఎడ్లపల్లి  గ్రామాల్లో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో ఇంటింటా ఆరు గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.నిరుపేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.ఇందుకు మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్ బాబునే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్దిoచారు. కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు.పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు,సంగ్గెం రమేష్,సర్పంచ్ జనగామ స్వరూప బాపు, జంగిడి శ్రీనివాస్, బొబ్బిలి రాజు,కేశారపు చెంద్రయ్య,జంగిడి సమ్మయ్య,బండి స్వామి,బండి సుధాకర్,ఇందారపు ప్రభాకర్,సదయ్య,  రాజునాయక్,రూపేస్ రావు,లింగన్నపేట శ్రీదర్,రమేష్,లింగయ్య,మురళి,రాజేశ్వర్ రావు,అబ్దుల్ అకిమ్ పాల్గొన్నారు.
Spread the love