మృతుని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండ..

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బుర్ర నిశాంత్ అంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లి వద్ద గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం యూత్ కాంగ్రెస్ రీసెర్చ్ విభాగం రాష్ట్రాధ్యక్షుడు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా తనవంతు సహయంగా బియ్యం, నగదందజేసి మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచారు.నాయకులు జనాగం శంకర్,గుండ అమరేందర్ రెడ్డి,అన్నాజీ వెంకటేశ్,బుర్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love