ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టి మండల యూత్ అధ్యక్షులు భూత శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన డిక్లరేషన్స్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ నిరుద్యోగ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ లను వివరిస్తూ గడపగడపకు ఆ కరపత్రాలని పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు జోగుల మంజుల, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మల్లారపు దేవయ్య,నాయకులు మల్లారపు లచ్చయ్య, దేవనందం, ముత్యం, కాంతయ్య, చంద్ర మొగిలి, తిరుపతి, రాయనర్సు , లక్ష్మీ న్, లింబనాయక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.