మండలంలోని నర్సాపూర్(పిఏ) గ్రామానికి చెందిన వడ్డెర సంఘం రాష్ట్ర జేఏసీ కన్వీనర్ తుర్క వీరబాబు తండ్రి, తుర్క అప్పయ్య గత వారం రోజుల క్రితం మృతి చెందగా, ఆదివారం దశదినకర్మకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు తుర్క అప్పయ్య నోట్లో నాలుక లేకుండా కలివిడిగా అందరితో ఉండేవాడని గుర్తు చేశారు. ఆయన మంచి స్వభావి అని అన్నారు. ఆయన మరణం తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సాపూర్ (పిఏ) మాజీ సర్పంచ్ నరసింహ స్వామి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి పులి రవి గౌడ్, మాజీ ఎంపిటిసి యాప మోహన్ రావు, యూత్ నాయకులు మర్రి నరేష్, సీనియర్ నాయకులు పల్నాటి సత్యం, ఓర్చు రామారావు, మొక్క దుర్గయ్య, రతన్ సింగ్, అల్లెం సాంబశివరావు, నాలి ఎర్రయ్య, జాజా వెంకటయ్య, గాందెర్ల కాంతారావు, మాజీ మండల అధ్యక్షుడు బండారు చంద్రయ్య, పసర మాజీ జెడ్పిటిసి కోటి, పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.