తుక్కుగూడ సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

నవతెలంగాణ – గోవిందరావుపేట
తుక్కుగూడ జన జాతర మహాసభకు కాంగ్రెస్ శ్రేణులు శనివారం మండలం నుండి భారీగా తరలి వెళ్లారు.  సభకు భారీగా తరలించేందుకు గత రెండు మూడు రోజులు నుండి మండల కాంగ్రెస్ నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రంగా కృషి చేశారు. రూలింగ్ పార్టీ నిర్వహిస్తున్న అతి పెద్ద సభ కావడంతో ఈ సభకు కేంద్ర నాయకులు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వంటి అగ్రసేనీ నాయకత్వం హాజరవుతుండడంతో ప్రజలు సభను దీక్షించాలన్న సంకల్పంతో భారీగా తరలి వెళ్లారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభ నిర్వహిస్తుండడంతో మరియు ములుగు ప్రాంతం నుండి సీతక్క ఆధ్వర్యంలో అత్యధిక ప్రజలు హాజరు కావాలని సంకల్పంతో ప్రజలను తరలించడంలో మండల నాయకత్వం చేసిన ప్రయత్నం సఫలీకృతం అయింది. మండల నాయకత్వంలో మహిళ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి మరియు ఇతర ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో ప్రజలకు తరలించారు.
Spread the love