‘విజయభేరి సభ’కు తరలిన కాంగ్రెస్ శ్రేణులు

నవతెలంగాణ పెద్దవంగర: హైదరాబాదులోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి భారీ బహిరంగ సభకు మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆదివారం భారీ ఎత్తున తరలి వెళ్లారు. సభకు వెళ్లే వాహనాలకు సురేష్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మండల ఇన్చార్జి విజయ్ పాల్ రెడ్డి తో కలిసి మాట్లాడారు. తుక్కుగూడ సభతో బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఝాన్సీ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభకు తరలి వెళ్ళిన వారిలో సీనియర్ నాయకులు ప్రసాద్ రెడ్డి, దుంపల శ్యామ్, పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీతారాం నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, పట్టణ యూత్ అధ్యక్షుడు అనపురం వినోద్, సుంకరి ఏసయ్య, సంపత్, చంద్రమౌళి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love