నిరుపేదలకు లబ్ధి చేకూరేలా కాంగ్రెస్‌ పథకాలు

– కాట్నపల్లి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ-సుల్తానాబాద్‌ రూరల్‌: నిరుపేదలకు లబ్ధి చేకూరేలా కాంగ్రెస్‌ పథకాలు రూపొందించామని నియోజకవర్గ ఇన్‌చార్జి తమిళనాడు రాష్ట్ర నంగునూరి ఎమ్మెల్యే రూబీ మనోహర్‌, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. తుక్కుగూడలో జరిగిన విజయభేరీ భారీ బహిరంగ సభ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డులను రూబీ మనోహర్‌, విజయరమణరావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. సోమవారం సుల్తానాబాద్‌ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ విజయభేరి భారీ బహిరంగ సభ కార్యక్రమ స్ఫూర్తితో గడపగడపకు సంక్షేమ పథకాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్‌ రొయ్యపల్లి మల్లేష్‌గౌడ్‌, బిమాగాని సౌజన్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్ల్ణు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎల్‌.రాజయ్య, సుల్తానాబాద్‌ జడ్పీటీసీ మినుపాల స్వరూపరాణి-ప్రకాశ్‌రావు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దన్నయాకి దామోదరరావు, మండల అధ్యక్షుడు చిలుక సతీష్‌, సయ్యుద్‌ మసర్త్‌, కాల్వల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love