అభివృద్ధిపై కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదం

– బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
నవతెలంగాణ పెద్దవంగర:
అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. చిట్యాల గ్రామానికి చెందిన కొయ్యెడి రామచంద్రు నిన్ను కాంగ్రెస్ పార్టీ చేరగా, తిరిగి బుధవారం బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు గ్రామంలో అభివృద్ధి పనులు జరగలేదని మాట్లాడడం సిగ్గు చేటన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి పథకాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి పరమేష్, మాజీ వార్డు సభ్యులు కొయ్యేడి యాకయ్య, రాపోలు సుదర్శన్, ఆవుల సోమన్న, బీసీ సెల్ నాయకుడు కోతి రాజు, చిప్పల స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love