కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

నవతెలంగాణ- పెద్దవంగర: మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ యువకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై 46,402 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో పలు గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో కాంగ్రెస్ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి, సంబరాలు జరుపుకున్నారు. పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి కాలనీలో చావడి దగ్గర సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగేలా కాంగ్రెస్ పార్టీ గెలిపించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు పథకాలు ప్రతి వ్యక్తికి అందిస్తామని అక్కడి నేతలు పేర్కొన్నారు.
Spread the love