నేడు అచ్చంపేటలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ..

– అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయండి: ఎమ్మెల్యే వంశీకృష్ణ 

నవతెలంగాణ – అచ్చంపేట 
లోక్సభ ఎన్నికలలో నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మల్లురవి గెలుపొందడంతో నేడు బుధవారం అచ్చంపేటలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. విజయోత్సవ ర్యాలీ కి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, లు పాల్గొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మల్లురవి విజయోత్సవ ర్యాలీ ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Spread the love