17న తుక్కుగూడాలో కాంగ్రెస్‌ విజయ భేరీ సభ

నవతెలంగాణ – హైదరాబాద్: 17న తుక్కుగూడాలో కాంగ్రెస్‌ విజయ భేరీ సభ నిర్వహించ బోతున్నట్లు కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ సభకు విజయ భేరి గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. బీజేపీ కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్ లో అనుమతి ఇవ్వకుండా చేసిందని సీడబ్యూలుసీ కి జాతీయ నాయకులు వస్తున్నారన్నారు. భద్రత కల్పించాలని కోరామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ తో కుమ్మక్కు అయ్యిస్ సీడబ్యూలుసీ సభ ను అడ్డుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇది రాజకీయ మర్యాద కాదని సీఎం కేసీఆర్ పై ఆగ్రహించారు.
హోంగార్డు రవీందర్ మృతిపై స్పదించిన: రేవంత్ రెడ్డి 
హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అంటూ రేవంత్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. హోంగార్డు రవీందర్ మృతి చెందాడు. జీతాలు రావడం లేదంటూ 4 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రవీందర్.. డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదు. .ప్రభుత్వ హత్య అన్నారు. ప్రభుత్వం అప్పులు చేసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోతుందని హోంగార్డులకు ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆంగ్రహించారు.

Spread the love