తాండూరులో..కాంగ్రెస్‌ ఘన విజయం

– రోహిత్‌రెడ్డిపై 6,284 ఓట్లతో
గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి మనోహర్‌ రెడ్డి
తాండూరు: తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. తాండూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పైలట్‌ రోహిత్‌ రెడ్డి పై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మనోహర్‌ రెడ్డి 6,284 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తాండూ రులో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ మద్య జరిగిన హౌరా హౌరీగా జరిగిన పోరులో హస్తం పార్టీ తాండూరును కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కిం పులో బుయ్యని మనోహర్‌ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొ ందారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డిపై డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌ రెడ్డి విజయం సాధించారు. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Spread the love