కాంగ్రెస్‌ కార్యకర్తలు, మిత్రపక్షాల ఓటర్లకు కృతజ్ఞతలు

– కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలకు కాంగ్రెస్‌ గెలుచు కోవడంతో పాటు మన కొత్తగూడెంలో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు భారీ మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలకు మిత్రపక్షల కార్యకర్తలకు ఓటర్లకు కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం కాంగ్రెస్‌ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే సీపీఐ పార్టీ అభ్యర్థి అయిన కూనంనేని సాంబశివరావు గెలుపు ముఖ్య కారణమైన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, రేణుక చౌదరీలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కొండం వెంకన్న, ఓబీసీ సెల్‌ అధ్యక్షులు కట్ట సోమయ్య, పట్టణ కాంగ్రెస్‌ నాయకులు తాళ్లూరు సత్యనారాయణ, భక్తుల వెంకటేశ రావు, రాంబాబు, సూర్యకిరణ్‌, కొండలరావు, శాంతి వర్ధన్‌, వి.రాంబాబు, విజరు, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love