నూతన ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు

– కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి ఎండి మౌలానా 
నవతెలంగాణ – నెల్లికుదురు
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హైదరాబాదుకు వచ్చిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయకుడు మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ నల్లికుదురు మండల ప్రచార కార్యదర్శి ఎండి మౌలానా గురువారం తెలిపాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం ఆత్మబలి దానాలు చేసుకుంటున్న క్రమంలో తల్లి సోనియా గాంధీ వెంటనే తెలంగాణను ప్రకటించిన అన్ని ఆ రుణం తీర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి పట్టణం కట్టిందని అన్నారు అందులో భాగంగా మా మహబూబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయకుడు పార్టీ కార్యకర్తలు ఏకధాటిపైకి వచ్చి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నామని అన్నారు అందుకోసం ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు మురళి నాయక్ గెలుపుతో ఈ ప్రాంతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మదనతుర్తి గ్రామ మాజీ ఉపసర్పంచ్ గోపకాని యాకన్న మండల కోశాధికారి గుండెపాక ప్రశాంత్ ఎస్టీ సెల్ జిల్లా నాయకులు వెంకన్న ఏర్పుల మురళి గోపగాని చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు
Spread the love