
నవతెలంగాణ – నెల్లికుదురు
ఖమ్మం లోని ఈనెల11,12వ తేదీలలో జరిగే రాష్ట్ర ద్వితీయ విద్య వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ నెల్లికుదురు మండలం ప్రధాన కార్యదర్శి సంఘ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని ఆలేరు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలోని ఈనెల 11 ,12,వ తేదీన రెండు రోజులపాటు టీపీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నయా బజార్ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న విద్యా వైజ్ఞానిక మహాసభలకు మండలం నుండి ఉపాధ్యాయ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. అంతరాలు లేని విద్య ప్రజల హక్కు ప్రభుత్వ బాధ్యత అనే నినాదంతో ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిక్షపతి, ఉదయ్ కిరణ్, బిక్షపతి, లక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు