నవతెలంగాణ – మల్హర్ రావు
అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కొయ్యుర్ పారెస్ట్ రేంజర్ రాజేశ్వర్ రావు అన్నారు. ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని కిషన్ రావు పల్లి బాట్ పరిధిలో అటవీశాఖ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడవుల రక్షణపై పశుల కాపర్లకు, ప్రజలకు, రైతులకు అటవీశాఖ అధికారులు విస్తృతంగా అవగాహన నిర్వహించారు. పశువుల కాపర్లు పారెస్ట్ లో వెళుతున్నప్పుడు వెంట అగ్గిపెట్ట,గొడ్డలి తీసుకవెళ్ళొద్దని సూచించారు. అడవులను నరికితే అటవీశాఖ చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, తాడిచెర్ల సెక్షన్ అధికారి లక్ష్మన్,బిట్ అధికారులు,ప్రజలు పాల్గొన్నారు.