నవతెలంగాణ – కంటేశ్వర్
ఐక్య కార్మిక ఉద్యమ వారధి సీఐటీయూ నాయకత్వం లో జరిగే పోరాటాల్లో పాలకవర్గ కుట్రలను బహిర్గతం చేయాలి అని సిఐటియు ఆవిర్భావ దినోత్సవ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ సిఐటియు పుట్టినరోజు 1970 మే 30 సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సిఐటియు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగిందని ఇప్పటికీ 53 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని సిఐటియు కార్మికులను ఐక్యం చేసి సంఘం నిర్మాణం చేసి పోరాటాల దిశగా ముందుకెళుతూ ఉద్యోగ కార్మికులహక్కుల కోసం నిర్విరామమైన పోరాటం చేస్తుందని అందుకు హక్కులు సాధించుకోగలుగుతున్నామని.ఐక్యత పోరాటం నినాదంతో రాష్ట్రంలో అనేక కార్మిక సంఘాలుఉద్యోగ భద్రత సాధించుకున్నాయని కేంద్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ సమ్మెలు సదస్సులు ర్యాలీలు చేస్తూ కార్మికుల హక్కులను సాధించుచున్నదని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 42 కేంద్ర కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడులు గా విభజించటంవల్ల కార్మిక వర్గం తీవ్ర అన్యానికి గురవుతుందని కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్ లను రద్దు చేయాలని కనీస వేతనాలు చట్ట ప్రకారం 26000 అమలు చేయాలని కులాల పేరుతో మతాల పేరుతో దేశంలో జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని137 సంవత్సరాల క్రితం సాధించుకున్న హక్కులను ఎనిమిది గంటల పని విధానాన్నిరద్దు చేస్తూ 12 గంటల పని విధానాన్ని తీసుకొస్తున్నకేంద్ర ప్రభుత్వంపై కార్మిక చట్టాల సాధనకైనిరంతరం పోరాడుతున్నదని పోరాడితేనే హక్కులు సాధించబడతాయని కళ్లెదుటే నిరూపిస్తున్న సంఘం సిఐటియు సంఘమనిఅ ఉద్యోగ కార్మికులు కొంతమేరకు హక్కు లు సాధించారంటే అది సిఐటియు ద్వారానే సాధ్యమైందని అందుకే సిఐటియు అనుబంధంగా మరో మారు రాష్ట్రంలో కనీస వేతనాలు ఉద్యోగ భద్రత చట్టబద్ధమైన పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలను సాధించాలంటే ఉదృతమైన పోరాటాల ద్వారానే సాధ్యమని అందుకు కార్మిక వర్గం అంతా రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.సిఐటియు అని, సిఐటియు మార్గదర్శకత్వం లో పాలక వర్గాల ప్రైవేటీకరణ,మతోన్మాద కుట్రలను బహిర్గతం చేసి కార్మికులను చైతన్య పరచడమే నేడున్న కర్తవ్యమని సిఐటియు జిల్లా కార్యదర్శి సిఐటియు ద్వారానే ఉద్యోగ కార్మికుల హక్కులు సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్, ఈవీఎల్ నారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రాజ్, జిల్లా కమిటీ సభ్యులు కటారి రాములు, కృష్ణ, పశుమిత్ర జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మౌనిక, లక్ష్మి, బీడీ జిల్లా నాయకులు విమలమ్మ, ఫారూఖ్ కాలుజాన్ గంగామణి యాస్మిన్ జరీనా తదితరులు పాల్గొన్నారు.