జీవో 46 రద్దు చేయాలని కానిస్టేబుల్‌ అభ్యర్థులు నిరసన దీక్ష

నవతెలంగాణ – హైదరాబాద్‌: గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. జీవో నంబరు 46 కారణంగా తాము నష్టపోయామంటూ పలువురు కానిస్టేబుల్‌ అభ్యర్థులు.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద శనివారం నిరసన దీక్ష చేశారు. జీవో నంబరు 46పై గత ప్రభుత్వంలోని హోం మంత్రికి అవగాహన లేకపోవడం, బోర్డు ఛైర్మన్‌ శ్రీనివాసరావు చేసిన తప్పిదం వల్ల అనేక మంది అభ్యర్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ జీవోను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు.

Spread the love