నియోజకవర్గ అభివృద్దే ద్యేయంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి అన్నా రు. శుక్రవారం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంగా ఆయన స్వగ్రామంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాంరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి సాధ్యమైందన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధిం చారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పులిగారి శివయ్య, నాయకు లు పిట్ల వెంకటయ్య, ఓలపు నారాయణ, పాల లక్ష్మీ నర్సాగౌడ్, సిరిసిల్లా రాజేశం, బండారు స్వామి గౌడ్, గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొ న్నారు.