నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని అధికారులకు, పదవి విరమణ చేసే మండల ప్రాదేశిక ప్రజాప్రతినిధులలు ముందుకు సాగాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అర్హులైన వారికి కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ, జడ్పిటిసి,ఎంపీపీ,ఎంపీటీసీ లకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని తాసిల్దార్ జి.సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడారు. మండలంలోని 80 మంది అర్హులైన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 8 లక్షల9280 రూపాయల చెక్కులను వారి చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.నియోజకవర్గంలో ధర్మసాగర్ చాలా ప్రత్యేకమైన మండలం గా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడానికి నా సాయి శక్తుల కృషి చేస్తానని అన్నారు.మండలంలోని దేవునూర్ ఇనుప రాతి గట్ల నుంచి రిజర్వాయర్ ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని మినీ ట్యాంక్ బండ్ గా ఏర్పాటు చేయడమే కాకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించడం జరిగిందని,ఆనాడు దేవాదుల పథకాన్ని ప్రవేశపెట్టి నీళ్లు రావడానికి ఏ రకంగా నైతే కృషి చేయడమైందో, అదే రీతిగా నేడు ధర్మసాగర్ రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.పదవి కాలం పూర్తయిన మండల ప్రాదేశిక సభ్యులు బాధపడనవసరం లేదని, మీరు ప్రజల చేత ప్రభుత్వానికి ప్రతినిధులుగా ప్రజాసేవ చేసుకోవడానికి ప్రజలు ఇచ్చిన అవకాశం గా ఐదు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసినందుకు గర్వపడాలన్నారు. మీరు చేసిన సేవ, నిజాయితీగా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో ప్రజలే మీకు ఆ అవకాశాలను మళ్లీ కల్పిస్తారని సూచించారు. వారి సమక్షంలో పుష్ప మాలలతో శాలువాలతో, గుర్తింపు మెమౌంటులను ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి పిట్టల శ్రీలత తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రజలకు ముఖ్య నాయకులకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు.అనంతరం వారికి శాలువాలతో సత్కరించి, తీపి జ్ఞాపికలను ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవితా రెడ్డి, వైస్ ఎంపీపీ బండారు రవీందర్, ఎంపీటీసీలు రెండు రాజు యాదవ్, కొలిపాక వనమాల, బొడ్డు శోభ, కోఆప్షన్ సభ్యులు సుకూర్, ఆకారపు నాగయ్య, పెద్ది శ్రీనివాస్ రెడ్డి, లక్క సునీత, బైరబాక జోజి అధికారులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.